ఘనంగా రక్షాబంధన్ వేడుకలు
పంచాయతీ సిబ్బందికి రాఖీ కట్టిన సర్పంచ్
జగిత్యాల, ఆగస్టు 22:
జగిత్యాల జిల్లాలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. రాఖీపొర్ణమి సందర్బంగా జిల్లాలోని ప్రముఖ దేవాలయాలు భక్తులతో కిక్కిరిపోయాయి.
అన్నా, తముళ్లకు రాఖీలు కట్టెందుకు వెళ్లిన సోదరిమనులు బొట్టు పెట్టి రాఖీ కట్టి స్వీట్లు తినిపించి ఎల్లపుడు రక్షగా ఉంటానని దీవించి భరోసా ఇచ్చారు.
అన్నా, చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతికగా నిలిచే రాఖీ పండుగను జిల్లా ప్రజలు ఆనందోస్తావాల మధ్య జరుపుకున్నారు.
రాఖీ పౌర్ణమినీ రక్షాబంధన్ పేరిట సోదరీ మణులు, సోదరులకు రాఖీ కట్టి నువ్వు నాకు రక్ష నేను నీకు రక్షా అంటూ తీపిపదర్తాలు తినిపించి కుటుంబమంతా సంతోషంగా జరుపుకున్నారు.
రాఖిపౌర్ణమి పండుగను పురస్కరించుకొని ఆదివారం పెగడపల్లి మండలం బతికేపల్లి సర్పంచ్ తాటిపర్తి శోభారాణి గ్రామ పంచాయతీ సిబ్బందికి రాఖీకట్టి మీకు నేను అన్నింటికీ రక్షగా ఉంటానని చాటిచెప్పారు.
సోదర, సోదరీమణుల అనుబంధానికి ప్రతికగా నిలిచేది రాఖీ పండుగ అంటూ బతికేపల్లి గ్రామo నాకు రక్ష – నేను గ్రామానికి రక్ష మనందరికీ దేశ సరిహద్దుల్లో దేశాన్ని రక్షించేందుకు అహో రాత్రులు విధులు నిర్వహిస్తున్న సైనికులు రక్షగా ఉంటున్నారని ఈసందర్బంగా సర్పంచ్ శోభారాణి అన్నారు.
జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి, ధర్మపురి, రాయికల్, మాల్యాల తదితర మండలాల్తో పాటు గ్రామాల్లో రక్షాబంధన్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
ఎఎన్ఎం గాండ్ల మధురిమ ఇతర ప్రజాప్రతినిదులు, ఉద్యోగినిలు, మహిళలు సోదరులకు రాఖీలు కట్టి సంబరాలు జరుపుకున్నారు. స్వంతంగా తొడబుట్టిన వాళ్లు లేకపోవడంతో చిన్నప్పటినుంచి దగ్గరగా ఉన్నవాళ్లు, అన్ని విధాలా సహాయపడ్డవారికి రాఖీకట్టి అనుబంధాలను కొనసాగించారు.
చిన్నారులు సైతం అన్నలకు రాఖీ కట్టి సంబరాలు జరుపుకున్నారు