జగిత్యాల లో సినీఫక్కీలో 1లక్ష 44 వేల నగదు చోరీ
జగిత్యాల: జగిత్యాల పాత బస్టాండ్ లో ఆటో కోసం ఎదురు చూస్తున్న వృద్ధునితో ఓ గుర్తు తెలియని వ్యక్తి మాటలు కలిపి రూ. 1లక్ష 44 నగదును అపహరించుకుపోయిన సంఘటన చోటుచేసుకుంది. మల్యాల మండలం మానాల గ్రామానికి చెందిన ఎడపల్లి గంగయ్య సోమవారం నాడు జగిత్యాల మండలం గోపాలరావు పేట లోని కుమార్తె ఇంటికి వెళ్లేందుకు పాత బస్టాండ్ లో ఆటో కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మాటలు కలిపి మీ అల్లుడు తెలుసని, ప్రస్తుతం అతను బ్యాంకులో ఉన్నాడని చెప్పి, అతనికి రెండు యాపిల్స్ తీసుకు రమ్మన్నాడని చెప్పాడు. దాంతో గంగయ్య రెండు యాపిల్స్ కొనుగోలు చేసి తెచ్చేలోపు మాటలు కలిపిన వ్యక్తి వద్ద ఉంచిన రూ. 1 లక్ష 44 వేల నగదును అపహరించుకుపోయడని గంగయ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా బాధితుడు గంగయ్య మంగళవారం చేసిన ఫిర్యాదు మేరకు జగిత్యాల పట్టణ సి ఐ కిషోర్ కేసు నమోదు చేసుకుని నిందితుని కోసం వివిధ కోణాల్లో గాలిస్తున్నారు.