కొండా లక్ష్మణ్ బాపూజీ కి ఎమ్మెల్యే నివాళి
జగిత్యాల: కొండ లక్ష్మణ్ బాపూజీ కలలను ముఖ్యమంత్రి కేసీఆర్ సాకారం చేస్తున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజాయ్ కుమార్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో శ్రీవైష్ణవి డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కొండా లక్ష్మణ్ బాపూజీ 9వ వర్ధంతి సందర్భంగా ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని కులాల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడైన బాపూజీ తన జీవితాంతం ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడారని గుర్తుచేశారు. 2001లో తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొని తన ఇంటిని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా మార్చిన ఘనత కొండ లక్ష్మణ్ బాపూజీ కే చెందుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల యజమాని చిట్ల సుదీర్, చేటిపెల్లి సుధాకర్, కౌన్సిలర్లు కుసరి అనిల్, హరిబాబు, గుగ్గిళ్ళ నాగభూషణం, వనామాల అనిల్, పవన్,కళాశాల ఉపాధ్యాయులు రజిత, అఖిల, శ్రవణ్, వెంకటేష్ , సురేష్ ఉన్నారు.