భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు
లలితామాత ఆలయంలో శ్రీచక్రార్చన పూజలు
గర్భాలయం, అర్ధాలయంలో కడప పూజలు
అమ్మవారికి ఓడిబియ్యం సమర్పించిన మహిళలు
జగిత్యాల, ఆగస్టు 20:
శ్రావణమాసం వరలక్ష్మి శుక్రవారం సందర్బంగా జగిత్యాల పట్టణంలోని ఆలయాలు భక్తులతో కిక్కిరిషాయి.
జగిత్యాల రూరల్ మండలం పొలాసలో నిర్మితమవుతున్న లలితామాత ఆలయంలో మహిళలువైభవంగా శ్రీచక్రర్చన పూజలు చేశారు.
గత 43 రోజులుగా ఆలయంలో లలితసహస్రనామా పారాయణం మహిళలచే ఆలయ పౌండరీ ట్రస్ట్ చైర్మన్ చెల్లం స్వరూప సత్తయ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
అందులోభాగంగానే శ్రావణ వరలక్ష్మి శుక్రవారంను పురస్కరించుకొని మహిళలు ఆలయానికి చేరుకొని అమ్మవారి చిత్రపటాన్ని పూలు, పండ్లు,పసుపు, కుంకుమ,గాజులతో అందంగా అలంకరించి లలితసాహస్రణమా పారాయణం గావించి సౌభాగ్యనికి చిహ్నంగా భావించి అమ్మవారికి పసుపు, కుంకుమ,గాజులు సమర్పించారు.
లలితమాతకు ముత్తయిదువలు ఓడిబియ్యం సమర్పించారు.
మహిళలు ఒకరికి ఒకరు పసుపు, కుంకుమ, గాజులు ఇచ్చుకున్నారు.
ఆలయానిర్మాణంలో భాగంగా గర్భాలయం, అర్ధాలయంలో ప్రముఖ జ్యోతిష్య పండితులు నంభి వేణుగోపాల చార్య కౌశిక ఆధ్వర్యంలో విషు శర్మ కడప పూజలు చేశారు.
అలాగే జగిత్యాల పట్టణంలోని అష్టలక్ష్మి ఆలయం, శివాలయం, వెంకటేశ్వరా, మార్కండేయ, సాయి బాబా ఆలయం, రామాలయం, అయ్యప్ప దేవాలయంతో పాటు ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. మహిళలు ఇండ్లల్లో ప్రత్యేక పూజలు చేసి బంధువులు, ఆత్మీయులకు పసుపు, కుంకుమ, గాజులు వాయినం ఇచ్చుకున్నారు.
భక్తులు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేయగా పూజారులు గోత్రనామాదులతో అర్చన చేశారు.
కార్యక్రమంలో పాంపట్టి సులోచన, పద్మ, రజిని, శ్రీదేవి, అర్చన, సౌజన్య, రాధిక, అంజలి, లక్ష్మి, రజని,
పాంపట్టి రవీందర్, నాగేందర్, సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.