జగిత్యాలలో రౌడీ షీటర్ దారుణ హత్య
జగిత్యాల: పట్టణంలోని హనుమాన్ వాడ కు చెందిన రౌడీ షీటర్ తోట శేఖర్ అలియాస్ గుండు శేఖర్ ( 30) అనే వ్యక్తి దారుణంగా హత్య గురి అయ్యాడు. హత్య చేసిన దుండగుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. నిన్న రాత్రి బీట్ బజార్ లో ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వద్ద మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో చికెన్ సెంటర్ లో వినియోగించే కత్తితో హంతకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు అని పోలీసుల ద్వారా తెలిసింది. పాత కక్ష్యలే దీనికి కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితున్ని అదుపులో తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.