Jagtial NewsJagtial Politics

మిషన్ భగీరథ పనులు పూర్తిచేయాలి:కౌన్సిలర్ నక్క జీవన్

జగిత్యాల, ఆగస్టు 19:
జగిత్యాల మున్సిపల్ పరిధిలోని 12 వ వార్డులో అసంపూర్తిగా ఉన్న మిషన్ భగీరథ పనులను పూర్తి చేసి ప్రజల తాగునిటీ ఇబ్బందులను తొలగించాలని జగిత్యాల 12 వ వార్డు కౌన్సిలర్ నక్క జీవన్ కోరారు.ఈమేరకు గురువారం జీవన్ మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం ఇచ్చారు.మిషన్ భగీరథ పైపులైన్ ద్వారా వార్డు ప్రజలకు తాగునీటిని అందిచాల్సి ఉండగా పనులు ఆశించిన మేర జరుగక పోవడంతో తాగునిటికి ఇబ్బంధులు పడుతున్నారని వాపోయారు.గుంతలు తవ్వి పనులు చేపట్టకపోవడం మూలంగా వర్షాల్తో గుంతల్లో నిరునిలిచి దోమలు వృద్ధి చెంది ప్రజలు రోగాల బారిన పడుతున్నారనితెలిపారు.

నిజామాబాదు రహదారిపై మిషన్ భగీరథ పైపు లైన్ పనులకోసం గుంతలు తవ్వి వదిలేయడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఇట్టివిషయమై సంబంధిత శాఖధికారులకు తెలిపిన పట్టించుకోవడం లేదన్నారు. వెంటనే పనులు ప్రారంభించి పూర్తిచేయాలని జీవన్ కమిషనర్ ను కోరారు