Jagtial NewsJagtial PoliticsLatest

ప్రభుత్వంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్

ప్రచారఅర్బాటాలకే పరిమితమైన ప్రభుత్వం
8450 మంది ఉద్యోగులను తొలగించిన ప్రభుత్వం
దళిత బందు రాష్ట్రమంతా అమలుచేయాలి
ఉద్యోగాలు లేక నిరాశకు లోనవుతున్న యువత
జగిత్యాల
:
రాష్ట్ర ప్రభుత్వం ప్రచార ఆర్బటాలకె పరిమితమైనది తప్పా నిర్మాణాత్మకంగా వ్యవహరించడం లేదని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాలు అయినప్ప టికీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ప్రభుత్వం ఇవ్వటం లేదని ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి విమర్శించారు. శనివారం జగిత్యాల మండలంలోని పోరండ్ల గ్రామా సర్పంచ్ సంధ్య రాణి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో 50 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వారికి కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది నీళ్లు, నిధులు, నియామకాల కొరకని, ఏడున్నార సంవత్సరాలు అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-1,ఉపాధ్యాయ,ఇతర ఉద్యోగాల నియామకాలు చేపట్టక ,ఉన్న ఉద్యోగులనె థొలగించింధని పేర్కొన్నారు. నిరుద్యోగ భృతీ అటకెక్కింధన్నారు.
బిశ్వాల్ కమిటీ నివేదిక ద్వారా ఒక లక్ష 90 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం పెడిచేవిన పెట్టి నిరుద్యోగులకు నిరాశ నిస్పృహలకు లోనయే విధంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు.
తెలంగాణ వస్తే ఉద్యోగ,ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశించి ఉద్యమానికి యువత ఊపిరినిస్టె వారికి కెసిఆర్ చేసింది శూన్యమని పేర్కొన్నారు.
పరిపాలన సౌలభ్యం కొసం కొత్తగా 23 జిల్లాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం 23 ఉద్యోగాలను సైతం భర్తీ చేయలేదని విమర్శించారు. కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు ఉద్యానశాఖ 450 మంది ఉద్యోగులు, 8వేల మంది ఉపాది హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లను కెసిఆర్ అకారణంగ తొలగించారని విమర్శించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో లక్ష మంది పాడి రైథులున్నరని పాల ధరను,ఇన్సూరెన్సు ఇవ్వకుండా పాడి పరిశ్రమను ధెబ్బథిసిన ఘనత కెసిఆర్ దే ధక్కుథుంధన్నార్.
దళితులకు మూడెకరాల భూమి మాట ఎమయింధని ముఖ్య మంత్రి కెసిఆర్ ను జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
దళితబంధు కింద 10 లక్షలు ఖాతాలో వేసిన ప్రభుత్వం ఖర్చు పెట్టుకొకుండ దళితుల ఖాతాలు ఫ్రీజింగ్ చేశారని విమర్శించారు.
దళితుల అభివృద్ది నిధులను పూర్తి స్తాయిలొ ఖర్చు పెట్టకుండా 35 వెల కోట్లు కెసిఆర్ తన వద్దే ఉంచుకుని వారిని మోసం చేస్తున్నారని ఇది దళితులు గమనించాలన్నరు.
హుజూరాబాద్ కే కాకుండా రాష్ట్రమంతా దళితబంధు వర్తింపజేయాలని ప్రభుత్వానికి సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్నయాత్మకా విధానాలు అవలంభించడం లేదని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవహారాన్ని చూస్తుంటే రాజకీయాల్లో ఎంధుకున్నమనె భాధ కలుగుంథుందనీ, ఇధి చూడడానికె మనం కొత్త రాష్ట్రం థెచ్హుకుంధని ఆవేదన వ్యక్తం చేశారు.
యువకులు భాధ్యతతో వ్యవహరించి కాంగ్రెస్ పార్టీ పతిష్టతకు పాటుపడాలని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు.
విజయదశమి సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో పోరండ్ల గ్రామానికి చెందిన యువకులు చేరడం రాబోయే రోజుల్లో అమ్మవారి ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ విజయానికి నాందిగా భావిస్తున్నానని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బండ శంకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్య, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుండ మధు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దుర్గయ్య, కౌన్సిలర్ నక్క జీవన్, రమేష్ రావు, బీరం రాజేష్ తో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *