పేదింటి ఆడబిడ్డకు సియం కానుక కల్యాణ లక్ష్మీ,షాది ముబారక్ : ఎమ్మెల్యే సంజయ్ కుమార్
కల్యాణ లక్ష్మీ షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల: జగిత్యాల పట్టణానికి చెందిన 137 మంది అడబిడ్డలకు రూ.1 కోటి 36 లక్షల 66 వేల 776 విలువగల కల్యాణ లక్ష్మీ , షాధి ముబారక్ చెక్కులను జగిత్యాల పట్టణ గీతా భవన్ లో జరిగిన కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరికి సంక్షేమ దిశగా ముఖ్యమంత్రి కార్యక్రమాలు చేపట్టారని, రైతుల కోసం24 గంటల కరెంట్, మిషన్ కాకతీయ, రైతు బీమా, రైతు బంధు ,ఏర్పాటు తూములు ఏర్పాటు,కాళేశ్వరం ప్రాజెక్టు, నకిలీ విత్తనాలు కట్టడం, ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టారని రైతుల అభివృద్ధి ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి నమ్ముతారని,రైతు బాగుంటే అందరూ బాగుంటారని, వ్యాపారాలు సజావుగా నడుస్తాయని అన్నారు.రాష్ట్ర అడబిడ్డల కోసం దేశంలోనే బీడీ పెన్షన్ లు 2016 చొప్పున నియోజకవర్గంలో 22 వేల మందికి బీడీ పెన్షన్అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, దేశంలో 16 రాష్ట్రాలలో బీడీ కార్మికులు ఉన్నారని తెలంగాణలో మాత్రమే పెన్షన్లు ఇస్తున్నామని అన్నారు. మహిళల కోసం కళ్యాణ లక్ష్మి, ఒంటరి మహిళ పెన్షన్, కెసిఆర్ కిట్, సాధారణ ప్రసవాలను పెంచడం, మహిళా పోలీస్ స్టేషన్లు, షీ టీమ్స్,గురుకులాలు ఏర్పారు, విద్యార్థినిలకు అవసరమైన వస్తువుల పంపిణీ,
ఒంటరి మహిళలు, ఆసరా పెన్షన్ కేసీఆర్ కిట్, మగ పిల్లాడు పుడితే 12 వేలు, ఆడ పిల్ల అయితే13 వేలు ఇస్తున్నామని,102 వాహనంలో ఇంటివద్ద చేరుస్తున్నామని అన్నారు. అంగన్వాడీ కేంద్రంలో బాలింతలకు 30 రోజులు గుడ్లు ఇవ్వడం ద్వారా ఆరోగ్య లక్ష్మీ పథకంలో భాగంగా 140 కోట్లు అదనంగా ఖర్చు అవుతుందని మహిళల కోసం అత్యధికంగా దేశంలో నిధులు కేటాయిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు.జ్ ముఖ్యమంత్రి జగిత్యాల ను జిల్లాగా చేశారని,మెడికల్ కాలేజి తో పాటే సూపర్ స్పెసిలిటీ ఆసుపత్రి మంజూరు చేసిన ముఖ్యమంత్రి కి జగిత్యాల జిల్లా ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి, కౌన్సిలర్లు పిట్ట ధర్మరాజు,తోట మల్లికార్జున్, క్యాదాసు నవీన్,పంబాల రాం కుమార్,కోరే గంగమల్లు,బొడ్ల జగదీష్,రాజియుద్దీన్,కో ఆప్షన్ రియాజ్ మామా,నాయకులు ముఖీమ్,కూతురు శేఖర్,దుమాల రాజ్ కుమార్,యూత్ అధ్యక్షుడు కత్రోజ్ గిరి,తదితరులు పాల్గొన్నారు.