Jagtial NewsJagtial Politics

దేశానికే దిక్సుచిగా దళిత బంధు పథకం: కొప్పుల ఈశ్వర్

దేశానికే ఆదర్శంగా దళిత బంధు పథకాన్ని సిఎం కెసిఆర్ తీసుకొచ్చారని మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం దళిత సాధికారత పథకం ప్రవేశపెట్టినందుకు ధర్మపురిలో దళిత సంఘాల ఆధ్వర్యంలో కృతజ్ఞత సభ జరిగింది. ఈ సమావేశంలో కొప్పుల మాట్లాడారు. రూ.1200 కోట్లతో సిఎం దళిత సాధికారత పథకం అమలు చేయడం దేశానికే ఆదర్శంగా ఉందన్నారు. మన సంక్షేమ పథకాలను చూసి ఇతర రాష్ట్రాలు స్ఫూర్తిగా తీసుకుంటున్నాయని, దళితుల ఆర్థికాభివృద్ధి కోసం భవిష్యత్‌లో మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకొస్తామని, దళారుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకే ఆర్థిక సాయం చేస్తామని కొప్పుల స్పష్టం చేశారు. సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలను కొనసాగించిన ఘనత తెలంగాణకే దక్కుతుందన్నారు.