విశ్రాంత ఉపాధ్యాయుడు రాజయ్య మృతి : నివాళులార్పించిన ఎమ్మెల్సీ
జగిత్యాల: జగిత్యాల పట్టణానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయులు కందుకూరి రాజయ్య మంగళవారం మృతి చెందారు.జగిత్యాల పట్టణంలో విద్యానగర్ లో నివాసముంటున్న ప్రభుత్వ విశ్రాంత ఉపాధ్యాయుడు కందుకూరి రాజయ్య అనారోగ్యంతో మరణించడంతో కరీంనగర్ పట్టభద్రుల శాసన మండలి సభ్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. జగిత్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు సురేందర్, 12వ వార్డు కౌన్సిలర్ నక్క జీవన్ తదితరులున్నారు.