GeneralJagtial NewsSports

జ్యోతి స్కూల్ విద్యార్థులను అభినందించిన కలెక్టర్

జగిత్యాల, ఆగస్టు 23: అంతర్జాతీయ స్థాయి పరుగు పందెం పోటీల్లో బంగారు పతకాన్ని సాధించిన జ్యోతి హై స్కూల్ విద్యార్థులను జగిత్యాల జిల్లా కలెక్టర్ గుగులోతు రవి అభినందించారు. జిల్లా కేంద్రంలోని జ్యోతి హై స్కూల్, జ్యోతి ఐఐటి అకాడమీ చెందిన విద్యార్థులు ఇండో-నేపాల్ రూరల్ గేమ్స్ ఫెడరేషన్ 2021 అంతర్జాతీయ స్థాయిలో జరిగిన అథ్లెటిక్స్ 100 మీటర్ల పరుగు పందెంలో ఆరే సృజన అనే విద్యార్థి బంగారు పతకం సాధించింది.అలాగే 400 మీటర్ల పరుగుపందెంలో అప్పని నిక్షిత్ పదవ తరగతి విద్యార్థి బంగారు పతకం సాధించాడు.ఈ విద్యార్థులు జాతీయ స్థాయిలో గత మార్చి నెలలో జమ్మూకాశ్మీర్లో జరిగిన పోటీలో పాల్గొని బంగారు పతకాలు సాధించి అంతర్జాతీయ స్థాయికి ఎంపిక అయ్యారు.నేపాల్లోని ఖాట్మండులో ఈనెల 15,16 తేదీల్లో జరిగిన అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని బంగారు పతకం సాధించగా కలెక్టర్ సోమవారం ప్రశంశించి సన్మానించారు.

ఈసందర్బంగా కలెక్టర్ రవి మాట్లాడుతూ జగిత్యాల జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా జ్యోతి విద్యార్థులు నిలిచారనీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ బియ్యాల హరిచరణ్ రావు, శ్రీధరరావులు పాల్గొన్నారు.