GeneralJagtial NewsLatest

ట్రాక్టర్ డ్రైవర్ల సంఘం అధ్యక్షులు గా పెద్దనవేని శంకర్

బుగ్గారం: గ్రామ ట్రాక్టర్ డ్రైవర్ల సంఘం అధ్యక్షులుగా పెద్దనవేని శంకర్ ఎన్నికయ్యారు. బుధవారం రాత్రి వరకు జరిగిన ఈ ఎన్నికల్లో ఉపాధ్యక్షులుగా కొడిమ్యాల రాజన్న, ప్రధాన కార్యదర్శి గా భారతపు శేఖర్, సహాయ కార్యదర్శి కేతి చిలుకయ్య, ఉపారపు అనూక్, కోశాధికారిగా భారతపు రాజశేఖర్, ప్రచార కార్యదర్శిగా విలసాగరపు పోచరాజులు ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులుగా జక్కుల శ్రీనివాస్ ను కూడా ఎన్నుకున్నారు. మొత్తం 69 మంది సభ్యులు ఉన్న ఈ సంఘాన్ని మరింత బలోపేతం చేసి సంఘ అభివృద్ధికి కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు పెద్దనవేని శంకర్ అన్నారు. సంఘ అభివృద్ధితో పాటు, సంఘ సంక్షేమానికి, గ్రామ అభివృద్ధికి, ప్రజా సంక్షేమం కొరకు పాటు పడుతామని హామీ ఇచ్చారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఘనంగా సన్మానించారు.