యం ఈ ఓ, హెచ్ యం ల సస్పెన్షన్ ఎత్తివేయాలి.
జగిత్యాల: కోరుట్ల మండలం ఏకిన్ పూర్ ప్రధానోపాధ్యాయుడు, కోరుట్ల మండల విద్యాధికారి సస్పెన్షన్ ను ఎత్తివేయాలని కోరుతూ గురువారం జగిత్యాల జిల్లా విద్యాధికారి కార్యాలయం ఎదుట జాక్టో, యు ఎస్ పి సి ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిన నేపథ్యంలో చాలా పాఠశాలల్లో సరిపడా ఉపాధ్యాయులు లేరని తెలిపారు..అక్కడక్కడ కొన్ని పాఠశాలల్లో పాఠశాల యాజమాన్య కమిటీ, పేరెంట్స్ ముందుకు వచ్చి ప్రయివేటుగా వాలంటీర్లను నియమించుకొంటే వారిని అభినందించాల్సిన అధికారులు, ఫీజుల వసూలుతో సంభంధం లేని ప్రధానోపాధ్యాయుడిని, మండల విద్యాధికారిని సస్పెండ్ చేయడం సరికాదని, ఇది ప్రభుత్వ పాఠశాలలకు ప్రతికూలంగా మారి విద్యార్థుల సంఖ్య పడిపోయే ప్రమాదం వున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే అక్రమ సస్పెన్షన్ నిలుపుదలచేసి వారిని విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎం.రఘుశంకర్ రెడ్డి, ఏ. గంగాధర్, కె.చంద్రమౌళి, బి.హరికిరణ్, టి.శ్యామ్ సుందర్, బి.రమేష్ , ఏ.రాంరెడ్డి, పి.రాజబాబు, ఎం.శంకర్, ఏ.నరేందర్, కె.రాంచంద్రం, గోవర్ధన్, జయంత్, గంగరాజం, సుదర్శన్, హరికృష్ణ ఉన్నారు.