GeneralJagtial NewsLatest

డీఎస్పీ ప్రకాష్ ను స్వాగతించిన : రెవెన్యూ అసోసియేషన్.

జగిత్యాల ఆగస్టు 30: జగిత్యాల డీఎస్పీగా పదవీభాద్యతలు స్వీకరించిన ఆర్.ప్రకాష్ ను తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ స్వాగతించి, శుభాకాంక్షలు తెలిపింది. ఆదర్శ ప్రజా సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పేరు తెచ్చుకొని ,డిఎస్పీ గా పదోన్నతి పొంది జగిత్యాల డీఎస్పీ గా భాద్యతలు చేపట్టిన ప్రకాష్ ను జిల్లా రెవెన్యూ ఉద్యోగుల అధ్యక్షుడు ఎం.డీ.వకీల్ ఆధ్వర్యంలో జిల్లా నాయకులు నాయబ్ తహశీల్దార్ గండ్ర రాజేందర్ రావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఖాజిమ్ లు డీఎస్పీ కార్యాలయంలో సోమవారం కలిసి శుభాకాంక్షలు తెలిపినట్లు రెవెన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జగిత్యాలడివిజన్ సర్వే అధికారి విఠల్ రావు, సర్వేయర్ ఫణి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.