కులవృత్తులకు అధిక ప్రాధాన్యం: ఎమ్మెల్యే సంజయ్
జగిత్యాల: కులవృత్తులకు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని 6వ వార్డ్ లో నాయి బ్రాహ్మణులకు 250 యూనిట్ల వరకు సబ్సిడీ కరెంట్, ఉచిత కరెంట్ మీటర్ల పంపిణీ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులకు ఎప్పటి నుండో ఉన్న కళను మన సియం కేసీఆర్ 250 యూనిట్ల సబ్సిడీ విద్యుత్తు, ఉచిత మీటర్ల పంపిణీ చేయటం నిజంగా చాలా సంతోషకరమైన విషయమని, ఈనాడు తెలంగాణ వచ్చిన తర్వాత వందల సంఖ్యలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం దేశం మొత్తంలో తెలంగాణ రాష్ట్రము మాత్రమేనని అన్నారు. ప్రతి కుల వృత్తి అభివృద్ధి కి ముఖ్యమంత్రి ప్రణాళికలు రూపొందిస్తున్నారని రాబోయే రోజుల్లో ప్రతి వర్గానికి సంక్షేమం చేకూరుతుందని, తెలంగాణ వచ్జిన తర్వాత నాయి బ్రాహ్మణులకు 24 గంటల కరెంటు ద్వారా రోజు మొత్తం ఉపాధి లభించిందని, గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు కరెంటు కోతలతో ఆర్థిక భారంతో ఉపాధి కోల్పోయి వలసలు వెళ్ళేవారని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి నెలకు 1750 రూపాయల నుంచి సంవత్సరానికి దాదాపు ఒక్క సెలూన్ షాప్ పైన 20 వేల వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంపై నాయి బ్రాహ్మణులు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలుపుతున్నాను అని అన్నారు. అనంతం మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కొలగాని ప్రేమలత సత్యం, వొల్లెపు రేణుక మోగిలి, సంఘ అధ్యక్షులు రాచర్ల విజయ్, ఉపాధ్యక్షులు పెండం గంగారాం రాష్ట్ర నాయకులు మనలా కిషన్, ప్రధాన కార్యదర్శి వేణు, యూత్ అధ్యక్షుడు కత్రోజ్ గిరి, నాయకులు నీలి ప్రతాప్, శ్రీనివాస్, నారాయణ, స్వామి, విక్రమ్, శ్రీను, గంగామల్లు, అశోక్, బీసీ వెల్పేర్ అధికారి సాయిబాబా, డి ఈ , ఏ డి ఈ జవహర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.