జగిత్యాల: ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో కాళోజీ నారాయణ రావు చిత్ర పటానికి పూలమాల వేసి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత – సురేశ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కాళోజీ తెలుగు భాష స్ఫూర్తి తెలంగాణ సాంస్కృతిక ఉద్యమానికి దిక్సూచిగా నిలిచిందన్నారు. “పుట్టుక నీది చావు నీది.. బతుకంతా దేశానిది” అని నినదించిన కాళోజీ జీవితమంతా తెలంగాణ భాషా సాహితీ సేవ దిశగా సాగిందని అన్నారు. కాళోజీ జయంతిని సందర్భంగా జిల్లాలోని అధికారులు, ప్రజా ప్రతినిధులు వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తు జిల్లాను మొదటి స్థానంలో ఉంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ (ఎఫ్ ఏ సి) సంధ్యారాణి జిల్లా పరిషత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు