విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించాలి : జడ్పి చైర్ పర్సన్
జగిత్యాల: విద్య వ్యవస్థ పటిష్ఠతకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు. జిల్లా ప్రజా పరిషత్ ఆధీనంలో పనిచేయుచున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తరగతులు ప్రారంభించుటకు జిల్లా పరిషత్ ద్వారా ఆమోదించబడిన అండర్ టేకింగ్ సర్టిఫికెట్స్ సంబంధిత ప్రధానోపాధ్యాయులు, ప్రజాప్రతినిధులకు మంగళవారం జిల్లా ప్రజా పరిషత్ క్యాంపు కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన దావ వసంత సురేష్ చేతులమీదుగా అందచేసారు.ఈ సమావేశంలో జడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన కల్పించాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. జిల్లాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కొరకు నూతన జిల్లాలను ఏర్పాటు చేసి ప్రజలకు అన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచడం పట్ల సియం కేసీఆర్ కు జడ్ పి చైర్ పర్సన్ కృతజ్ఞతలు తెలిపారు.