జగిత్యాల: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం అగ్గిమల్లకు చెందిన తోటవేని వెంకటేష్ (23) అనే యువకుడు దారుణంగా హత్యకు గురి అయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయుధంతో గొంతు కోసి హతమార్చారు. అయితే హత్యకు గల కారణాలు తెలియరాలేదు. గ్రామస్తుల సమాచారం ప్రకారం గొల్లపల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. అవివాహితుడైన వెంకటేష్ హత్య ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు స్థానికంగా వివరాలు సేకరిస్తున్నారు.