జగిత్యాల:18 ఏళ్ళు నిండిన వారికి కూడా కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా కలెక్టర్ సంబంధించిన జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో వారు పంపిణీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో 18 ఏళ్ళు నిండిన వారికి వ్యాక్సిన్ ఇచ్చు కేంద్రాలను ప్రకటిస్తూ జగిత్యాల మున్సిపల్ అధికారులు గురువారం ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు.