అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 10 న నాని టక్ జగదీష్
సెప్టెంబర్ 10 న నాని నటించిన ”టక్ జగదీష్” చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేయనున్నారు. ఆమేరకు ఈరోజు స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసారు టక్ జగదీష్ మేకర్స్. సెప్టెంబర్ 10 న నాగచైతన్య – సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ విడుదల అవుతోంది దాంతో అదే రోజున టక్ జగదీష్ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేయొద్దని పలువురు బయ్యర్లు కోరారు దాంతో డేట్ మారుతుందేమో అనుకున్నారు కానీ డేట్ మార్చకుండా అదే రోజున రిలీజ్ చేస్తున్నారు.
అసలు ఈ చిత్రాన్ని థియేటర్ లోనే విడుదల చేయాలని నాని అనుకున్నాడు. కానీ యాక్టింగ్ చేయడం వరకే నాని పని సినిమాని ఎక్కడ రిలీజ్ చేయాలో నిర్మాతల పని దాంతో వాళ్లకు అమెజాన్ ఆఫర్ బాగా నచ్చడంతో రిస్క్ అందుకని ఇలా ఓటీటీలోనే విడుదల చేస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నాని సరసన రీతూ వర్మ నటించింది. ఇక కీలక పాత్రల్లో జగపతి బాబు , ఐశ్వర్య రాజేష్ డేనియల్ బాలాజీ , నాజర్ తదితరులు నటించారు.
నిన్ను కోరి వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత నాని – శివ నిర్వాణ కాంబినేషన్ లో తెరకెక్కిన రెండో సినిమా ఇది. దాంతో టక్ జగదీష్ చిత్రంపై అంచనాలు ఓ లెవల్ లో ఏర్పడ్డాయి. అయితే అమెజాన్ ప్రైమ్ లో ఇంతకుముందు నాని నటించిన ” వి ” సినిమా రిలీజ్ అయ్యింది కానీ అది ప్లాప్ జాబితాలో చేరింది. కట్ చేస్తే ఇప్పుడు టక్ జగదీష్ కూడా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతోంది. మరి ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.