Site icon Jagtial Latest News & Updates – Mana Jagtial-మన జగిత్యాల

పారా ఒలింపిక్స్ లో భారత్ కు స్వర్ణం

avani lekhara

avani-lekhara

టోక్యో లో జరుగుతున్న పారా ఒలింపిక్స్ 2020 లో భారత్ కు స్వర్ణ పతకం లభించింది. షూటింగ్ 10 మీటర్ల విభాగంలో అవని లేఖారా  గోల్డ్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించింది. పారా ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం గెలుపొందిన తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించింది. ఈ గోల్డ్ మెడల్ తో మొత్తంగా నాలుగు పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. ఫైనల్‌లో అవనీ లేఖరా 249.6 రికార్డు స్కోరుతో బంగారు పతకం దక్కించుకోగా, చైనాకు చెందిన కుయ్‌పింగ్ ఝాంగ్ 248.9 స్కోరుతో రజత పతకాన్ని గెలుచుకున్నారు. ఉక్రెయిన్‌కి చెందిన ఇరినా షెత్నిక్ 227.5 స్కోరుతో తో కాంస్య పతకం దక్కించుకున్నారు. అవని సాధించిన విజయం పట్ల ప్రశంసల వర్షం కురుస్తోంది.

Exit mobile version