రాష్ట్రంలో విద్యకు అత్యంత ప్రాధాన్యత
టీబీసీ జేఏసి రాష్ట్ర అధ్యక్షుడు హరి అశోక్ కుమార్.
టీబీసీ ,టీ పెన్షనర్స్, సీనియర్ సిటీజన్స్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దినోత్సవం.
విశిష్ట ఉపాధ్యాయులకు సన్మానాలు.
జగిత్యాల: ఆది యుగం నుంచి ఆధునిక యుగం వరకు సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడు విద్యాబుద్ధులు నేర్పే గురువేనని,అందుకే మన సమాజంలో అమ్మా నాన్నల తర్వాత స్థానం గురువులకే ఇచ్చారని టీ బీసీ జేఏసి రాష్ట్ర అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ న్నారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని నేతాజీ వృత్తి విద్యాకళాశాల సమావేశ మందిరంలో టీబీసీ జేఏసి,టీ పెన్షనర్స్ ,టీ సీనియర్ సిటీజన్స్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం ను ఘనంగా కోవిడ్ నిబంధనల మేరకు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. జిల్లాలో రిటైర్డ్ విశిష్ట ఉపాధ్యాయులు మానపురి రాజ నర్సయ్య, గుండేటి రాధా కిషన్, విశిష్ట ఎస్జీటి ఉపాధ్యాయుడు చుక్క మల్లికార్జున్ లను ఘనంగా పట్టుశాలువాలతో, అవార్డులతో సన్మానించారు. ఈ సందర్భంగా హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ర్టంలో విద్యకు అత్యంత ప్రాధాన్యం స్తున్నారని,దేశంలోని ఏ రాష్టంలో లేని విధంగా అత్యధిక గురు కులాలు పెట్టి నాణ్యమైన విద్యను అందిస్తున్నారని కొనియాడారు. దేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయిని సావిత్రి బాయి పూలే జన్మదినోత్సవాన్ని సైతం జాతీయ విద్యా దినోత్సవంగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో టీబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగం భాస్కర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారి విజయ్,సీనియర్ సిటీజన్స్ కాగజ్ నగర్ జిల్లా అధ్యక్షుడు మార్త సత్యనారాయణ, పెన్షనర్స్ జిల్లా కార్యదర్శి బొల్లం విజయ్,సీనియర్ సిటీజన్స్ జిల్లా కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం, వివిధ సంఘాలు ప్రతినిధులు గాజంగి రాజనర్సయ్య, సింగం గంగాధర్, మోతె ఉమాకాంత్, నేతాజీ కాలేజి ప్రిన్సిపల్ బి. గంగాధర్, సీనియర్ అధ్యాపకులు వెంకటేశ్వర్లు,రమేష్, ఉమ్మడి జిల్లా విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు ధోనూరి భూమాచారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.