జగిత్యాల: పట్టణంలోని కొత్త బస్టాండ్ లో గల సులబ్ కాంప్లెక్స్ లో గురువారం ఉదయం 9.30 గంటలకు గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఇతనికి మృతికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. మృతిని ఆచూకి కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సులబ్ కాంప్లెక్స్ మరుగుదొడ్డిలో పూర్తిగా కాలిపోయి మృత దేహం ఉండడంతో ఈ సంఘటన జిల్లా కేంద్రంలో కలకలం సృష్టించింది.
సమాచారం ఇవ్వాలి: జగిత్యాల టౌన్ పోలిస్
మృతుడి కి చెందిన సమాచారం ఏవరికైనా తెలిస్తే జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్లో అందించాలని జగిత్యాల సి ఐ కోరే కిషోర్ సూచించారు. మృతుడి వయసు సుమారు 35 ఏండ్ల నుంచి 40 ఏండ్ల లోపుగా ఉంటుందని, మృతదేహం జగిత్యాల జిల్లా ఆసుపత్రిలోని మార్చురీలో భద్రపరచడం జరిగిందన్నారు. తెలిసిన వారు జగిత్యాల పట్టణ సీఐ కోరే కిషోర్, 94407 95136 నంబర్ కు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు