Site icon Jagtial Latest News & Updates – Mana Jagtial-మన జగిత్యాల

కొండా లక్ష్మణ్ బాపూజీ కృషి మరువలేనిది: మున్సిపల్ ఛైర్పర్సన్

Sri Konda Laxman Bapuji Vardhanthi

Sri Konda Laxman Bapuji Vardhanthi

జగిత్యాల: తెలంగాణ రాష్ట్ర సాధనలో కొండా లక్ష్మణ్ బాపూజీ కృషి మరువలేనిదని జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ భోగ శ్రావణి అన్నారు. మంగళవారం కొండ లక్ష్మణ్ బాపూజీ వర్దంతి సందర్భంగా జగిత్యాల పట్టణoలోని అంగడి బజార్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి మున్సిపల్ ఛైర్పర్సన్ డా.బోగ శ్రావణి ప్రవీణ్ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన విశిష్ట వ్యక్తి బాపూజీ అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకులు బోగ.వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్ష కార్యదర్శి, రుద్ర శ్రీనివాస్, చేటపెళ్లి సుధాకర్, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు వొల్లాల గంగాధర్, బోగ జిఆర్, కౌన్సిలర్లు అల్లే గంగసాగర్, గుర్రం రాము, నాయకులు అడువాల లక్ష్మణ్,కస్తూరి శ్రీ మంజరి, ఎలిగేటి నర్సయ్య పద్మశాలి సంఘం కార్యవర్గం తదితరులు పాల్గొన్నారు.


అలాగే టిబిసి జెఏసీ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు రాష్ట్ర అధ్యక్షులు హరి అశోక్ కుమార్ ఘనంగా నిర్వహించారు.
ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీబీసీ నాయకులు సింగం భాస్కర్, కొండా లక్ష్మణ్,టీబీసీ మహిళా జిల్లా అధ్యక్షురాలు కస్తూరి శ్రీమంజరి, కృష్ణ మూర్తి, వెంకట్, అనిల్, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version