రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగించాలి:ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
18 ఏళ్లకే ఓటుహక్కు, నూతన సంస్కరణలకు శ్రీకారంచుట్టిన రాజీవ్
జగిత్యాల, ఆగష్టు 20:
దేశంలో శాంతినెలకొల్పేందుకు పాటుపడి దేశంకోసం ప్రాణాలర్పించిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఆశయాలను యువత కొనసాగించాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి సూచించారు.
రాజీవ్ గాంధీ జయంతి సందర్బంగా శుక్రవారం జగిత్యాల ఇందిరాభవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కాంగ్రెస్ నాయకులతో కలిసి రాజీవ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అలాగే జగిత్యాల బై పాస్ రోడ్డులోని రాజీవగాంధీ విగ్రహానికి పూలమాలావేశారు.
రాజీవ్ గాంధీ
ప్రధాని కాలంలోనే
నూతన సంస్కరణలు చెప్పటడంతో దేశం సాంకేతిక రంగంలో నేడు అభివృద్ధి చెందిన్ధన్నారు.
18 సంవత్సరాలకే ఓటుహక్కు కల్పించి యువతకు ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం చేసిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కిందాన్నారు. దేశంలో హిందూ ముస్లీమ్ ల ఐక్యతకోసం సద్ భావన యాత్ర చేపట్టారని,ప్రపంచ శాంతిని నెలకొలపెందుకు కృషిచేశారని కొనియాడారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు గెలిచి కేంద్రంలో అధికారం చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ మెజారిటీ స్థానాలు రాలేదని ప్రతిపక్షంలో కూర్చున్న గొప్ప ప్రజాస్వామ్యవాది రాజీవ్ గాంధీ అన్నారు. స్థానికసంస్థలకు కేంద్రం ఢిల్లీ నుంచి గల్లీకి నేరుగా నిధులు అందించి గ్రామాలను అభివృద్ధిపరిచారని తెలిపారు.
నాడు ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయీకరణ చేస్తే నేడు మోదీ ప్రభుత్వం బ్యాంకులను ప్రయివేటు పరం చేస్తుందని, రైతు వ్యతిరేక విధానాలను అవాలభిస్తుందని జీవన్ రెడ్డి విమర్శించారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యుల నడ్డివిరించందాన్నారు.
రాష్ట్ర కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులు, జగిత్యాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో సాంకేతిక విప్లవానికి నందిపలికారన్నారు.
పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నారు.
గ్రామపంచాయితీలకు నేరుగా నిదులిచ్చి వాటిని అభివృద్ధిభటలో పయనింపజేశారన్నారు.
రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలర్పించారని ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు.