పెద్దపల్లి: మంథని మండలం ఏగ్లస్ పూర్ గ్రామ సమీపంలోని గాడిదల గండి గుట్ట అటవీ ప్రాంతంలో కారు – ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో బస్సు , కారు లోయలో పడిపోయిన ఘటన చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కన్సాయ్ పేటకు చెందిన వినిత్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో 20 మంది ప్రయాణికులుండగా, ముగ్గురికి తీవ్రంగా,16 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి.
గాయపడిన వారిని మంథని ప్రాంతీయ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. 20 మంది ప్రయాణికులతో బెల్లంపల్లి నుండి హనుమకొండ వెళ్తున్న పరకాల డిపో కు చెందిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న మంథని పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ప్రమాద ఘటన పై విచారణ చేపట్టాలని అధికారులను అదేశించగా ఆర్టీసీ అధికారులు విచారణ చేపట్టారు.