Jagtial NewsLatest

పాత్రికేయులకు “జర్నలిస్టు బంధు” అమలుచేయాలి

ఇళ్లస్థలాలు, హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్లు ఇవ్వాలి

జర్నలిస్టులకు కొత్త బట్టలు, నిత్యావసరవస్తువుల పంపిణి : ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కిషన్ రెడ్డి

జగిత్యాల, సెప్టెంబర్ 8:
పాత్రికేయులకు రాష్ట్ర ప్రభుత్వం “జర్నలిస్టు బంధు” పథకం అమలుచేసి అన్నివిధాలా ఆదుకోవాలని జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్ ను కోరారు. బుధవారం జగిత్యాలలోని దేవిశ్రీ గార్డెన్ లో జగిత్యాల ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 50 మంది పాత్రికేయులకు గుప్త దాతలు అందించిన కొత్త బట్టలు, నిత్యావసరవస్తువులు, మాస్కులు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి పంపిణి చేశారు. ఈసందర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాత్రికేయుల పట్ల చిన్నచూపుచుడవద్దని, వారి సంక్షేమానికి జర్నలిస్ట్ బంధు అమలుచేసి నిధులు కేటాయించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాత్రికేయులకు వైద్యం కోసం హెల్త్ కార్డులు అందించాలని, ఇళ్లస్థలాలు, అక్రిడిటేషన్లు ఇవ్వాలని దీనికి జిల్లాకు చెందిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, విద్యాసాగర్ రావు, రవిశంకర్, రమేష్ బాబు, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు దావా వసంతలు చొరవ తీసుకోవాలని కోరారు. కరోనా సమయంలో పాత్రికేయులు వృత్తి నిబద్ధతతో పనిచేశారని, కరోనాతో మృతి చెందిన జర్నలిస్టులకు 10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, కరోనా భాధితులకు వైద్య ఖర్చులు ఇవ్వాలని కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్, మంత్రి కేటిఆర్ లను కోరారు.
జగిత్యాల ప్రెస్ క్లబ్ 2021 సభ్యుల సంక్షేమానికి పాటుపడుతుందని చెబుతూ, మాకు సహకరిస్తున్న గుప్త దాతలకు కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రతినిధులు ద్యావర సంజీవ రాజు, జైపాల్, గుర్రం చంద్ర శేఖర్, అనంతుల కాంతారవు,తోట హన్మంతు పటేల్, కిషోర్, మాకు రాజలింగం, భూమి వేణుమాధవ్, బండారి సదా శివ కుమార్, పొన్నం లావణ్య,పెండెం మహేందర్, ఆముద లింగా రెడ్డి, డానీయల్ రాజు,గాజుల నాగరాజు, రాజశేఖర్, చింత రోజా, శ్రీనివాస్, శ్రీకాంత్,సత్యనారాయణ, శ్రావణ్, పూర్ణ చందర్, కృష్ణ కుమార్, గంగాధర్ తదితరులున్నారు