జగిత్యాల పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో శుక్రవారంనాడు నిషేధిత గుట్కా పట్టుబడింది. గంధం హరి కిషన్ అనే వ్యాపారి ఇంటి నుండి నిషేధిత గుట్కా కారులో తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా, శుక్రవారం ఆ కార్లను తనిఖీ చేయగా అందులో రెండు బ్యాగుల అంబర్, రెండు బ్యాగుల సితార, 12 బ్యాగుల విమల్, 12 బ్యాగుల విమల్ గుట్కా మసాలా పట్టుబడింది. పట్టుకున్న నిషేధిత గుట్కా విలువ దాదాపు నాలుగు లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.