జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని బీట్ బజార్ లోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో తోట శేఖర్ (29) హత్య కేసులో నిందితులను జగిత్యాల టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జగిత్యాల డిఎస్పీ ఆర్. ప్రకాష్ సి ఐ కిషోర్ తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు. 16 న జరిగిన హత్య కేసు విచారణలో ఇద్దరు నిందితులుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఇరువురిని అరెస్టు చేసి సోమవారం రిమాండ్ కు తరలించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఈ కేసులో నిందితులైన సమిండ్ల మహేష్ , వీరబత్తిని సాయి కిరణ్ లపై రౌడీ షీట్ ఓపెన్ చేసినట్లు డీఎస్పీ ప్రకాష్ వెల్లడించారు.