పట్టణ ఫోటోగ్రాఫర్, వీడియో గ్రాఫర్ యూనియన్ అధ్యక్షునిగా జగన్
జగిత్యాల: జగిత్యాల పట్టణ ఫోటోగ్రాఫర్, వీడియో గ్రాఫర్ యూనియన్ అధ్యక్షునిగా ఇప్ప జగన్ మోహన్ ఎన్నికయ్యారు. ఇందులో అధ్యక్ష , ఉపాధ్యక్ష, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, క్యాషియర్ పదవులకు పోటీ నెలకొనగా, మిగతా పదవులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా గుండేటి రాజశేఖర్, ప్రధాన కార్యదర్శిగా శిరిపురపు శ్రీనివాస్ సంయుక్త కార్యదర్శిగా తూర్పాటి శంకర్, క్యాషియరుగా గుడిసె లవకుమార్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎలక్షన్ కమిటీ సభ్యులు బుధవారం తెలిపారు.
