Site icon Jagtial Latest News & Updates – Mana Jagtial-మన జగిత్యాల

విజయదశమి నవరాత్రి ఉత్సవాల కరపత్రాల ఆవిష్కరణ

dussera at jagtial

dussera at jagtial

జగిత్యాల జిల్లా కేంద్రంలోని సువర్ణ దుర్గ సేవా సమితి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కరపత్రాలను ధరూర్ క్యాంప్ శ్రీ కోదండ రామాలయంలో ఆలయ కమిటీ చైర్మన్ బ్రహాండభేరి నరేష్, కౌన్సిలర్ ఒద్ది శ్రీలత రామ్మోహన్,టీవీ సూర్యం, రేగొండ నరేష్ ల ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా నిత్యం అమ్మవారికి విశేషమైన పూజలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అక్టోబర్ నెల 7వ తేదీ నుండి ప్రారంభమై 15వ తేదీన విజయదశమి వరకు ఉత్సవాలు ముగుస్తుందని తెలిపారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ప్రతిఒక్కరూ తప్పనిసరి మాస్క్ , సానిటైజ్ చేసుకోవాలని సూచించారు.
సువర్ణ దుర్గ సేవా సమితి చారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు బొద్దున రాంగోపాల్, కటుకం శశాంక్, త్రిలోక్, వెంకటేష్, విక్రమ్, తాటిపాముల వినోద్, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version