కష్టపడి చదివితే విజయం తద్యం : జడ్జి సుష్మిత
జగిత్యాల, ఆగస్టు 23:
జగిత్యాల రూరల్ మండలం తకళ్ళపల్లి గ్రామానికి చెందిన వడ్లురి సుష్మితను సోమవారం గ్రామస్తులు సన్మానించారు.
గ్రామ మహిళా సంఘం సభ్యురాలు వడ్లూరి దేవమ్మ – లచ్చయ్య ల కూతురు సుష్మిత జూనియర్ సివిల్ జడ్జిగా నియామకం కాగా
శ్రీ ఆంజనేయ గ్రామ ఐక్య సంఘ సభ్యులు సుస్మితతో పాటు ఆమే తల్లిదండ్రులను శాలువా, పూల బొకే, జ్ఞాపీకలతో ఘనంగా సన్మానించారు.
తోటి మహిళ సంఘ సభ్యురాలు కూతురు ఉన్నత స్థాయికి ఎదగడం ఎంతో ఆనందంగా ఉందని పలువురు మహిళలు ఆనందం వెలిబుచ్చారు.
ఈ సందర్భంగా జడ్జి సుస్మిత మాట్లాడుతూ నా ఉన్నత చదువులకు కృషి చేసిన తల్లిదండ్రులకు, గురువులకు, గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, కష్టపడితే కోరుకున్న రంగంలో విజయం సాదించవచ్చునని, ఒక విజన్ తో, పట్టుదలతో చదివితే ఎలాంటి విజయమైన సాధించవచ్చనీ అన్నారు.
తల్లి దండ్రులు తమ పిల్లల భవిష్యత్ కి పునాది వేయాలని, ముఖ్యంగా ఆడపిల్లలను ఖచ్చితంగా ఉన్నత చదువులు చదివించాలన్నారు.
స్థానిక సర్పంచ్ రాణి, ఎంపిటిసి సురేందర్, ఎ పిఎం గంగాధర్, మాజీ మార్కెట్ చైర్మన్ దశరద్ రెడ్డి, జిల్లా సిసి సత్యం, మండల సిసిలు సంతోష్,గంగారాం, రవీందర్, మరియా, వీఓఎ డి.లత, వీఓ అధ్యక్షురాలు డి. శారద, మాజీ అధ్యక్షురాలు జి.పద్మ,మహిళ సంఘం సభ్యులు,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.