Site icon Jagtial Latest News & Updates – Mana Jagtial-మన జగిత్యాల

మున్నూరుకాపు కార్పొరేషన్ ఏర్పాటుకై కృషి చేయండి.

munnuru kapu corporation jagtial

munnuru kapu corporation jagtial

ఎమ్మెల్యే సంజయ్ ను కోరిన మున్నూరుకాపు నేతలు.

జగిత్యాల: తెలంగాణ లో మున్నూరుకాపు కార్పొరేషన్ ఏర్పాటు కృషిచేయాలని, సిఎంతో చర్చించి కార్పొరేషన్ కలను సాకారం చేయాలని జగిత్యాల నియోజకవర్గ మున్నూరుకాపు నేతలు కోరారు. గురువారం కార్పొరేషన్ సాధన దిశలో భాగంగా రాష్ట్ర కన్వీనర్ పుట్టం పురుషోత్తం పటేల్ పిలుపుతో అన్ని అసెంబ్లీల ఎమ్మెల్యేలకు వినతిపత్రం ఇచ్చే భాగంలో జగిత్యాల ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. అనంతరం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మున్నూరుకాపు కార్పోరేషన్ ఏర్పాటు అనేది తెలంగాణా ప్రతి మున్నూరుకాపు బిడ్డ కల అన్నారు. ఈ కల సాకారానికై దశల వారిగా నేతలను కలుస్తూ తమ అభిమాతాన్ని వెల్లడిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర కన్వీనర్ పిలుపుతో ఈ రోజు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కలిశామన్నారు. సీఎం కేసీఆర్ కు మున్నూరుకాపుల ఆకాంక్షను తెలపాలని కోరామన్నారు. వినతికి స్పందించిన ఎమ్మెల్యే సంజయ్ ముఖ్యమంత్రి కి వినతిపత్రం అందజేసి కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్నూరుకాపు కౌన్సిలర్లు బండారి నరేందర్,తోట మల్లికార్జున్, చుక్క నవీన్ , కూతురు శేఖర్, నేతలు దీటి అంజయ్య పటేల్ , ఆడప గంగన్న ,చిట్ల సుదీర్, అంగలి రాజన్న, చిట్ల రవీందర్, ములాసపు రాజన్న, నలువాల వెంకన్న, తీగల సూర్యప్రసాద్ , కొల్లూరి వేణు, నీలి ప్రతాప్,నాడెపు శంకర్, నీరాటి గంగారెడ్డి, సిద్ది దశరథం, మామిడి సాగర్, జంగిలి గణేష్ ,సిరిపురం రాజేశం, భారతపు లింగారెడ్డి, కొలగాని వెంకన్న , కొలగాని అంజన్న, నీలం అంజిత్, కూసరి రాజు పాదం ప్రవీణ్, సంఘ నాయకులు పాల్గొన్నారు.

Exit mobile version