Site icon Jagtial Latest News & Updates – Mana Jagtial-మన జగిత్యాల

గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిన కేసీఆర్ : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

mlc-jeevan-reddy-gulf-policy

mlc-jeevan-reddy-gulf-policy

ఉద్యమకారులను సమరయోధులుగా గుర్తించాలి

ఎన్ ఆర్ ఐ పాలసీ అమలుచేసి గల్ఫ్ కార్మికుల భీమా ప్రకటించాలి

ప్రయివేటు రంగంలో విద్యను అమ్మకానికిపెట్టిన ప్రభుత్వం

ఉద్యోగ ఖాళీలను భర్తీచేయాలి

ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల, సెప్టెంబర్ 5: తెలంగాణాలోని అన్నివర్గాలతో పాటు గల్ఫ్ కార్మికుల కుటుంబాల పోరాట ఫలితంగానే అధికారంలోకి వచ్చిన కేసీఆర్ వారి సంక్షేమాన్ని విస్మరించడం సబబుకాదని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల దేవిశ్రీ గార్డెన్లో ఆదివారం జగిత్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సధస్సు గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు షేక్ చాంద్ పాషా అధ్యక్షతన జరుగగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్బంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి చెందిన 10 లక్షల మంది ఇక్కడ ఉపాధిలేక గల్ఫ్ లో ఉద్యోగాలు చేస్తున్నారని వారు నెలకు 10 వేల రూపాయల చొప్పున నెలకు వెయ్యి కోట్లు, ఏడాదికి 12 వేలకోట్లు విధేశిమారక ధ్రవ్యాన్ని భారతప్రభుత్వానికి సమాకూరుస్తున్నారని చెప్పారు. సంపాదన ఇక్కడే పెట్టుబడి పెడుతున్నారని అందులో 10 శాతం ప్రభుత్వానికి అమ్మకంపన్ను రూపేణా నెలకు 100 కోట్లు కాగా ఏడాదికి 1200 కోట్ల రూపాయలు సమాకూరిస్తే గల్ఫ్ కార్మికుల ఖర్చుపెట్టింది శూన్యమన్నారు. గల్ఫ్ కార్మికులు మరణిస్తే 5 లక్షలు ఇస్తానన్నా కేసీఆర్ ఏయిర్ పోర్ట్ నుంచి రవాణా సౌకర్యం తప్పా ఒక్క రూపాయి వారి కుటుంబాలకు ఇచ్చిన పాపానపోలేదని కేసీఆర్ తీరుపై జీవన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.
గల్ఫ్ కార్మికుల కోసం ఎన్ ఆర్ ఐ పాలసీ అమలుచేయడమే కాకుండా రైతు భీమా మాదిరిగా గల్ఫ్ కార్మిక భీమా అమలుచేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమాన్ని విస్మరిస్తే గల్ఫ్ కార్మిక కుటుంబాలు నీకళ్లు తెరిపిస్తారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ పోరాటాయోధులను సమరయోధులుగా గుర్తించాలని ఆనాడు శాసనసభలో తాను ప్రశ్నించానని చెబుతూ వారిని గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వానిపై ఎంతైనా ఉందన్నారు. పోరాటాల ఫలితంగానే నీవు అధికారం అనుభవిస్తున్నావని ఇప్పటికైనా వారి కుటుంబాలను ఆదుకోవాలని జీవన్ రెడ్డి తెరాస అధినేత కేసీఆర్ కు సూచిస్తూ వారికీ నేను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మనం ఆశించిన తెలంగాణ ఏది.. కొనసాగుతున్న తెలంగాణ ఏదని ప్రశ్నిస్తూ ప్రజలు ఆశించిన మేర లక్ష్యాలు చేరుకోలేకపోతున్నామని పేర్కొంటూ మాలిదశ ఉద్యమo జగిత్యాల జిల్లా కేంద్రంగా ప్రారంభం కానుందని చెప్పారు. విద్య, ఉద్యోగాలు మెరుగుపడుతయనుకుంటే ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేస్తూ ప్రయివేటు రంగంలో విద్యను ప్రోత్సహిస్తూ కేసీఆర్ అమ్మకానికి పెట్టడని విమర్శించారు. కెజి టూ పిజి ఆంగ్ల మాధ్యమా ఉచిత నిర్బంధ విద్య ఏమయిందని ప్రశ్నించారు.
ప్రయివేటు విశ్వ విద్యాలయాల్లో స్థానికతకు ఎలాంటి రిజర్వేషన్లు కల్పించబడకపోవడంలో అర్థమేమిటో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.
అధికార వికెంద్రికరణ కోసం 23 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం 23 ఉద్యోగాలను కల్పించలేదని, అలాగే శాఖలను కుదింపు చేశాడని జీవన్ రెడ్డి ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు.
బిశ్వాల్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పిందని పేర్కొంటూ గత జనవరి లో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పిన కేసీఆర్ 8నెలలు గడుస్తున్నా నోటిఫికేషన్ ఎందుకు వేయలేదని ఇదేనా ఉద్యోగ ఖాళీలపై నీకున్న చిత్తశుద్ధని విమర్శించారు. దశలవారీగా మూడేళ్లలో ఉద్యోగాల భర్తీ చేయాలని కేసీఆర్ కు సూచించారు.
ఆర్టీసీనీ ఆదాయమార్గంగా మేలుచుకోవడానికే ప్రభుత్వం చూస్తోందని నిరుపేదలకు రవాణా సౌకర్యం పట్ల ప్రభుత్వం ప్రయత్నం చేయడంలేదని జీవన్ రెడ్డి విమర్శించారు.
దాంతో ఆర్టీసీ ఉంటాదో.. పోతదో నని కార్మికులు ఆందోళనచెందుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అంజయ్య హయాంలో రవాణా వ్యవస్థమేరుగుకు చర్యలు చేపడితే నేటి సీఎం కేసీఆర్ ఆర్టీసీ, ఆస్తులు అమ్మడానికి చూస్తున్నాడని ఎద్దేవా చేశారు.
35 వేల కోట్ల దళితుల అభివృద్ధి నిధులను దారి మల్లించిన కేసీఆర్ దళితబంధు పేరిట మరోసారి దళితులను మోసంచేయడానికి ప్రయత్నిస్తున్నాడని, చెస్టే రాష్ట్ర వ్యాప్తంగా అమలుచేయాలని డిమాండ్ చేశారు. బీసీల్లోని ఇతరకులాలకు ఫెడరేషన్లు ఏర్పాటుచేస్తున్న కేసీఆర్ వాటికీ నిధులు విడుదల చేయాలని మభ్య పెట్టవద్దని జీవన్ రెడ్డి హెచ్చరించారు.
సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్, ఆనందం,జనార్దన్ గౌడ్, సత్యనారాయణ, బండ శంకర్, ముసిపట్ల లక్ష్మి నారాయణ, యుగంధర్, ప్రభాకర్, సాయన్న, నక్క జీవన్, మున్నా, శ్రీహరి, రాజానర్సు, తదితరులు పాల్గొన్నారు

Exit mobile version