Site icon Jagtial Latest News & Updates – Mana Jagtial-మన జగిత్యాల

వెనుకబాటుకు గత పాలకులే కారణం: ఎమ్మెల్యే డాక్టర్ సంజాయ్ కుమార్

mlampc2

mlampc2

జగిత్యాల: వెనుకబాటుకు గత పాలకులే కారణం అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజాయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని 7వ వార్డ్ లో పట్టణ ప్రగతి నిధులు రూ. 8 లక్షలతో సీసీ డ్రైన్, రోడ్డు నిర్మాణానికి మంగళవారం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణి తో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల పట్టణం చాలా పురాతన మున్సిపల్ అని 1956 లో మున్సిపల్ గా ఏర్పాడ్డ కానీ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా వెనకబడి ఉందని, 40 ఏళ్ల నుండి అధికారంలో ఉన్నది ప్రజలకు తెలుసునని అనుమతులు లేకుండా ఇష్టారీతిన పర్మిషన్ ఇచ్చిన ఘనత నాటి నాయకులదని అన్నారు. జగిత్యాల పట్టణంలో అనేక సమస్యలు ఉన్నాయని సమస్య పరిష్కారం కోసం గత మున్సిపల్ పాలకవర్గం దృష్టి సారించలేదని నేడు 121 సర్వే నంబర్లు జోన్ మార్పు తెచ్చామని ఇప్పుడు ప్రతి ఒక్కరికి అనుమతులతో పాటు బ్యాంకు లోన్ కూడా వస్తుందన్నారు. ప్రజల సహకారంతోనే పట్టణ అభివృద్ధి సాధ్యమని, దరూర్ క్యాంపు లో10 కోట్లతో కట్టిన నీటి ట్యాంక్ 10 సం, నిరుపయోగంగా ఉన్నదని నేడు ఉపయోగంలోకి తీసుకు వచ్చామని అన్నారు. కొత్త బస్ స్టాండ్ సమీపంలో 500 కోట్లతో మెడికల్ కాలేజి, సూపర్ స్పెషలిటి ఆసుపత్రి మంజూరైంది అని, వచ్చే సంవత్సరం నుండి తరగతులు ప్రారంభం అవుతాయని,7 కోట్ల తో పనులు ప్రారంభం అయ్యాయని జగిత్యాల మెడికల్ హబ్ గా తయారవుతుందని అన్నారు. పట్టణంలో స్మశాన వాటికలు, డివైడర్లు, ప్రజా మరుగుదొడ్లు, మార్కెట్ల అభివృద్ధి,అమర వీరుల స్తూపం, పార్కులు ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. జిల్లా కేంద్రం ఏర్పడం వల్ల ప్రజలకు జిల్లా ప్రభుత్వ శాఖలు అందుబాటు లోకి వచ్చాయని లేకుంటే కరీంనగర్ వెళ్లే పరిస్థితి వచ్చేదని, సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలో దాదాపు 50 ప్రభుత్వ శాఖలు అందుబాటులో ఉంటాయని అన్నారు. ప్రజలు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్లాస్టిక్ ఉపయోగం తగ్గించాలని,తడి, పొడి చెత్తను వేరుగా వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్ వల్లెపు రేణుక మోగిలి, యూత్ అధ్యక్షుడు గిరి,రైతు, కార్మిక విభాగం అధ్యక్షులు బండారు నరేందర్, శెట్టి శ్రీనివాస్,నాయకులు సమాండ్ల శ్రీనివాస్, రామ్మోహన్ రావు, నారాయణ, నవీన్, ప్రవీణ్, బాలే శంకర్, కోలగని సత్యం, అరవింద్, కౌన్సిలర్లు కూతురు రాజేష్ , చాంద్ పాషా,కుసరి అనిల్,పంబల రాం కుమార్, కో- ఆప్షన్ సభ్యుడు శ్రీనివాస్, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Exit mobile version