యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
రాజీవ్ గాంధీ జయంతి సందర్బంగా జిల్లా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తాదాన శిభిరం నిర్వహించారు.జగిత్యాల ఇందిరా భవన్ లో ఏర్పాటు చేసిన రక్తాదాన శిభీరాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రారంభించారు.రాష్ట్ర కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి, తాటిపర్తి రాంచంద్ర రెడ్డి, బాపురెడ్డి తోపాటు 25 మంది రక్థధానం చేశారని జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గుండా మధు తెలిపారు.కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవానికి యూత్ కాంగ్రెస్ నాయకులు కృషి చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కళ్ళెపెల్లి దుర్గయ్య, కౌన్సిలర్ నక్క జీవన్, కాంగ్రెస్ నాయకులు బండ శంకర్, మన్సూర్ అలీ, గుంటి జగదీశ్వర్, బింగి రవి,నరేష్ రెడ్డి , విజయ్, రజినీకాంత్, పుప్పాల అశోక్, దయ్యాల శంకర్, మున్నా, మహిపాల్ యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.