Site icon Jagtial Latest News & Updates – Mana Jagtial-మన జగిత్యాల

నర్సుపై చర్య లోద్దు

జగిత్యాల ఆగస్ట్ 22:

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నాట్యం చేసిన స్టాఫ్ నర్సు పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని టీ బీసీ ఉద్యోగుల జేఏసి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ఆ జిల్లా కలెక్టర్, వైద్యాధికారిని కోరారు.ఆదివారం ఆయన జగిత్యాల జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు.కరోనా కష్ట కాలంలో స్వంత కుటింబీకులు సైతం దగ్గర ఉండి సేవలు అందించలేని ప్రాణాపాయ పరిస్థితుల్లో అహర్నిశలు కరోనా బాధితులకు ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందిస్తున్న నర్సుల సేవలకు వెలకట్టలేమన్నారు.అలాంటి త్యాగమయ నర్సులు స్వాతంత్ర్య దినోత్సవం నాడు తమ కొలీగ్ ను నాట్యం చేయాలని కోరడంతో బుల్లెట్ డాన్స్ చేసి వారికి మానసిక ఉల్లాసం కలిగించడం తప్పేలా అవుతుందని విమర్శలు చేసే వాళ్లను ప్రశ్నించారు.ఆగస్టు 15 న సెలవు,స్వాతంత్ర్య దినోత్సవం కావడంతో ఆస్పత్రి సిబ్బంది కోరడంతో డాన్స్ చేశానని,తమ ఫ్రెండ్స్ సరదాగా పలువురు ఫ్రెండ్స్ కు షేర్ చేయడంతో వైరల్ అయ్యిందని ఆ స్టాఫ్ నర్స్ రజని అధికారులకు సంజాయిషీ సైతం ఇచ్చినందున ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తమ సంఘం తరపున ఆ జిల్లా కలెక్టర్, వైద్యాధికారిని కోరారు.

Exit mobile version