కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి యువత కృషిచేయాలి
యూత్ కాంగ్రెస్ నేతలకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పిలుపు
జగిత్యాల, ఆగష్టు 19:
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి యువత కృషిచేయాలని కరీంనగర్ పట్టభద్రుల కాంగ్రెస్ ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి యూత్ కాంగ్రెస్ నాయకులకు పిలుపునిచ్చారు.యువజన కాంగ్రెస్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాజరయ్యారు.ఈసందర్బంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ పార్టీ బలోపేతనికి ప్రతి ఒక్కరు పాటుపడాలని సూచించారు. ప్రభుత్వ వ్యతిరేకవిధానాలను ప్రజలకు వివరిస్తూనే గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాలన్నారు. యూత్ కాంగ్రెస్పార్టీ చేయవలసిన కార్యక్రమాల గుర్చి జీవన్ రెడ్డి నాయకులకు దిశానిర్ధేశం చేశారు.
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇంచార్జి సామ్రాట్ వంశీ, జిల్లా అధ్యక్షులు గుండ మధు, రఘువీర్ గౌడ్, పోతునుక మహేష్, కిరణ్, విజయ్, జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం అధ్యక్షులు బాపురెడ్డి, తోట నరేష్, రియాజ్, అనుదీప్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.