పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో కాళోజీ జయంతి వేడుకలు
జగిత్యాల: జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజా కవి శ్రీ కాళోజీ నారాయణరావు గారి 107 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. పోలీస్ ప్రధాన కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అడ్మిన్ ఎస్పీ కె. సురేష్ కుమార్ గారు కాళోజి చిత్రపటానికి పూలమాలవేసి వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ కవి కాళోజి మన అందరికీ ఆదర్శప్రాయమన్నారు. కాళోజి గారు తన రచనల ద్వారా పెత్తందారీ వ్యవస్థను, అన్యాయాన్ని ఎదిరించారన్నారు. తెలంగాణ భాషకు, యాసకు పట్టం కట్టిన మహనీయుడని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఏ ఆర్ డీఎస్పీ బాల్ రెడ్డి, ఏ ఓ చంద్ర మోహన్ గారు, ఆర్ ఐ నవీన్, డిపిఓ కార్యాలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.