Jagtial NewsJagtial Politics

టిఆర్ఎస్ సోషల్ మీడియా గ్రూపులు ఏర్పాటు

జగిత్యాల శాసన సభ నియోజకవర్గం పరిధిలోని జగిత్యాల రూరల్ మండలంలో తెరాస సోషల్ మీడియా గ్రూపులను మంగళవారం ఏర్పాటయ్యాయి.జగిత్యాల మండలం తెరాస అధ్యక్షులు దుమ్మని బాలముకుందఓ, మండల రైతు బందు సమితి అధ్యక్షులు నక్కల రవీందర్ రెడ్డిల ఆధ్వర్యంలో తెరాస పార్టీ సోషల్ మీడియా గ్రూపులను ప్రతి గ్రామంలో వేస్తున్నరు.దీనిలో బాగంగా రూరల్ మండలం లోని అనంతారం,గుట్రాజ్ పల్లి కల్లెడ, తక్కళ్లపెల్లి, హబ్సిపూర్, సంగంపల్లి, సోమనుపల్లి,గుల్లపేట, మోరపల్లి, తాటిపల్లి, అంతర్గం గ్రామాలలో సోషల్ మీడియా కమిటీలను మంగళవారం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు, ఉపసర్పంచ్ లు, రైతు బంద్ సమితి అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు