జగిత్యాల: తెలంగాణ రాష్ట్ర సమితి సెప్టెంబర్ 2న నిర్వహించే జెండా పండుగను గ్రామ గ్రామాన, పట్టణంలో ప్రతి వార్డులో జెండా పండుగ నిర్వహించాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం పార్టీ శ్రేణులతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశం ప్రకారం పల్లెల్లో పట్టణాలలో పార్టీ పునర్నిర్మాణానికి అందరూ కృషిచేయాలని, నూతన కమిటీలను ఎన్నుకోవాలన్నారు. ఈమేరకు జగిత్యాల టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జగిత్యాల పట్టణ జగిత్యాల్ అర్బన్ మండల, రాయికల్ ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు సమావేశమై పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి సమావేశాన్ని స్వయంగా హాజరై పర్యవేక్షిస్తానని పార్టీ మనుగడ ముఖ్యమని, ప్రతి ఒక్క నాయకుడు క్రమశిక్షణతో పని చేసి విజయవంతం చేయాలన్నారు.