క్రీడాకారులను అభినందించిన కలెక్టర్..
జగిత్యాల: ఈ నెల 7,8 తేదిలలో రంగారెడ్డి జిల్లా లో నిర్వహించిన కిక్ బాక్సింగ్ సీనియర్స్ పోటీల్లో జగిత్యాల జిల్లా కు చెందిన నలుగురు విద్యార్థులు గోల్డ్ మెడల్స్ ను సాధించారు. తిరిగి ఈ నెల 27 నుండి 29 వరకు గోవాలో జరగనున్న నేషనల్ లెవల్ (జాతీయ స్థాయి) పోటీల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా గోల్డ్ మెడల్ సాధించిన నలుగురు విద్యార్థులను జిల్లా కలెక్టర్ జి.రవి సోమవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో అభినందించారు. ఈ కార్యక్రమంలో కిక్ బాక్సింగ్ జిల్లా అధ్యక్షుడు డా.మోర సుమన్ కుమార్, కార్యదర్శి, కోచ్ రామాంజనేయులుతో పాటుగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. కాగా జిల్లా నుంచి గోల్డ్ మెడల్ సాధించిన వారిలో మామిడిపల్లి నగేష్, పొన్నగంటి భానుప్రకాష్, నేత్లి విజయ్, బి.కేశవ ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రవి వారిని అభినందిస్తూ తాము శిక్షణ పొందిన క్రీడలో గోల్డ్ మెడల్స్ పొందడం వారి పట్టుదల, కృషికి నిదర్శనమన్నారు.
జాతీయ స్థాయిలో సైతం మంచి పట్టుదలతో బంగారు పతకాలు సాధించాలని, జిల్లాకు పేరు తేవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.