Jagtial NewsLatest

భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి: జిల్లా SP సింధు శర్మ

జగిత్యాల,సెప్టెంబర్ 7: గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఎస్సారెస్పి, కడేం ప్రాజెక్టు లద్వారా లక్షా 50వేల క్యూసెక్ల నీటిని దిగువ గోదావరిలోకి విడుదల చేయడం జరిగినందున గోదావరి పరివాహక, లోతట్టు ప్రాంతాలలో అధికారులు అప్రమత్తం కావాలని జిల్లా ఎస్పీ సింధూ శర్మ సూచించారు. మంగళవారం పోలీస్ అధికారులతో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎగువ ప్రాంతాలలో ప్రాజెక్టులలో నిండిన నీటిని దిగువకు విడుదల చేసినందున గోదావరి పరివాహక మండలాల్లో, లోతట్టు ప్రాంతాలలో అధికారులు అప్రమత్తమై జాగ్రత్తగా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.
రోడ్లపై నుండి నీరు ప్రవహిస్తున్న, ఉప్పొంగి పొర్లుతున్న కాలువల వైపు రాకపోకలను పూర్తిగా మూసివేయాలని, లోతట్టు ప్రాంతాలలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారికి కావాల్సిన ఆహారం వంటి మౌళిక వసతులు కల్పించాలని రెవెన్యూ అధికారులతో కలిసి ,సహకారం అందించాలని పోలీస్ అధికారులకు సూచనలు చేశారు. పాతఇళ్లు, గోడలు పడిపోయో స్థితిలో ఉన్నవాటిని గుర్తించి, ఎక్కడాకూడా ఎటువంటి నష్జం వాటిల్లకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కోన్నారు. వర్షాల వల్ల వరదలు ఉదృతంగా ప్రవహించే అవకాశాలు ఉన్నందును గ్రామాలు సందర్శిస్తూ అధికారులు ఎప్పటికప్పుడు గ్రామ సర్పంచ్ లతో వాట్సాప్ గ్రూపులలో సమాచారం తెలుసుకుంటుండాలనీ వివరించారు.
రోడ్లపై చెట్లు పడిపోవడం, నీరు నిలువకుండ నీటిని తొలగించే చర్యలు తీసుకోవాలని ఎస్పీ సింధుశర్మ పోలీసులకు సూచించారు.