వేయి అక్షరాల భావం ఒక చాయచిత్రం గడిచినకాలాన్ని భవిష్యత్తులో గుర్తుచేసేది ఫోటో
జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి
ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడికి సన్మానం
జగిత్యాల, ఆగష్టు 19:
వెయ్యి అక్షరాల భావం ఒక ఛాయాచిత్రమని, ఫొటోకు అంతటిప్రాముఖ్యత ఉందని జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి అన్నారు.ప్రపంచ ఫోటో గ్రఫీ దినోత్సవం సందర్బంగా గురువారం జగిత్యాల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలోని దేవిశ్రీ గార్డెన్ లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
జగిత్యాల జిల్లా ఫోటో గ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ ను ఈసందర్బంగా ప్రెస్ క్లబ్ పక్షాన సన్మానించారు.
ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కిషన్ రెడ్డి మాట్లాడుతూ విలేకరులకు ఫోటోగ్రాఫర్లకు మధ్య అనుబంధం విడదీయాలేనిదన్నారు.
పాత్రికేయులు వెయ్యి అక్షరాల్లో చెప్పదలుచుకున్న భావాన్ని ఒక్క ఫోటో ద్వారా పలికించవచ్చన్నారు.
ఫోటో ఒక మధుర అనుభూతి అని పేర్కొన్నారు.
ఫోటో గ్రాఫర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వేముల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి క్షణం మధురనుభూతిని అందించేది ఫోటో మాత్రమేనన్నారు.
గడిచిన కాలాన్ని భవిష్యత్తులో నెమరువేసుకోవడానికి ఫోటో ఉపయోగపడుతుందన్నారు.
గతంలో మనం చేసిన కార్యక్రమాలను తెలుసుకునేది ఒక్క ఫోటోనేనని శ్రీనివాస్ చెప్పారు.
ఫోటో గ్రఫీని, ఫోటో గ్రాఫర్లను జగిత్యాల ప్రెస్ క్లబ్ గుర్తించడం సంతోషధాయకమన్నారు.
కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రతినిధులు గుండేటి రాజు, తోట హన్మంతు పటేల్, అనంతుల కాంతరావు, భూమి వేణుమాధవ్, రాజశేఖర్, ఆముద లింగా రెడ్డి, రవి, ఫోటో గ్రాఫర్లు కస్తూరి శ్యామ్, చిట్ల అనిల్, ఉపేందర్, తూర్పాటి అనిల్, మామిడిపెల్లి శ్రీనివాస్, పెండెం జలందర్ తదితరులు పాల్గొన్నారు