శ్రీవైష్ణవి కళాశాలలో ఘనంగా వీడ్కోలు వేడుకలు
జగిత్యాల జిల్లా కేంద్రంలోని లక్ష్మి గార్డెన్స్ లో జరిగిన శ్రీవైష్ణవి డిగ్రీ కళాశాల 2018-21 చెందిన విద్యార్థుల ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిగ్రీ తృతీయ సంవత్సరం విద్యార్థులు శ్రీవైష్ణవి డిగ్రీ కళాశాల, వీడ్కోలు సమావేశం నిర్వహించగా విద్యార్థులు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల యజమానులు చిట్ల సుధీర్, చేట్టిపెల్లి సుధాకర్, ఉపాద్యాయులు రజిత, అఖిల, లావణ్య, వెంకటేష్ , శ్రావణ్, సురేష్ ,గంగాధర్, స్వాతి తదితరులు పాల్గొన్నారు.