Site icon Jagtial Latest News & Updates – Mana Jagtial-మన జగిత్యాల

గల్ఫ్ బాధిత కుటుంబానికి ఆర్థికసహాయం

Gulf-NRI-Policy

Gulf-NRI-Policy

తెలంగాణ రాష్ట్రం లో ఎన్ ఆర్ ఐ పాలసీ అమలు చేయాలని డిమాండ్.

జగిత్యాల జిల్లా: మెట్ పల్లి మండలం యూసుఫ్ నగర్ గ్రామానికి చెందిన రాపర్తి పురుషోత్తం గత నెల సౌదీఅరేబియాలో మరణించగా గల్ఫ్ అవేర్నెస్ సెంటర్ (GWAC) అధ్యక్షులు దొనికెని కృష్ణ సోమవారం కుటుంబసభ్యులను పరామర్శించి అసంస్థ తాబూక్-సౌదీ శాఖ సభ్యులు రెండు గ్రూప్ ల సహకారంతో సమీకరించిన రెండులక్షల ఇరవైమూడు వేల అయిదువందల రూపాయల మొత్తం నగదును సంస్థ సభ్యులు అందజేశారు.అయితే సౌదీ అరేబియా నుండి పార్థివదేహం రాకముందు మృతుని కుటుంబసభ్యులను కలిసి 10,000 ల రూపాయలు అందజేసినట్లు పేర్కొన్నారు.

కాగా GWAC సంస్థ సభ్యులు గల్ఫ్ కార్మికులు పొగుచేసిన నగదును గల్ఫ్ మృతుడు రాపర్తి పురుషోత్తం కుటుంబానికి అందివ్వడం పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబాన్ని ఆదుకోవడాన్ని గ్రామస్తులు అభినందించారు. ఇట్టి కార్యక్రమంలో గల్ఫ్ వర్కర్స్ అవేర్నెస్ సెంటర్ అధ్యక్షులు కృష్ణ దొనికెని సహా సభ్యులు బీమేశ్,రాజేందర్,సాయికృష్ణ, గంగాధర్,అశోక్, నాగ భూషణ్ సయ్యిద్ ఆరిఫ్, గంట చిన్నారెడ్డి, పెసరి గణేశ్,రాజేందర్ గౌడ్,పడాల రాజు పాల్గొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేసి 10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించాలని అతని కుటుంబానికి అండగా నిలవాలని దొనికెని కృష్ణ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Exit mobile version