HealthJagtial News

కరోనాతో పాటు డెంగ్యూ విష జ్వరాలు అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: జడ్ పి చైర్ పర్సన్ దావ వసంత

జగిత్యాల: జిల్లాలో కరోనా మహమ్మారితో పాటు డెంగ్యూ, విషజ్వరాలు విజృంభిస్తున్న తరుణంలో ప్రజలకు వ్యాధుల పట్ల అవగాహన కల్పించి వాటి నివారణ కొరకు జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య సెంటర్ల లోని వైద్యులు, సిబ్బంది విధి నిర్వహణలో ప్రజలకు అందుబాటులో వుండి నిరంతరం వైద్యసేవలు అందించాలని జడ్పీ చైర్ పర్సన్ దావా వసంత సురేష్ అన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం రూ. 3.00 కోట్లతో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ లో సాంపిల్ కలెక్షన్ టెస్టులు అందుబాటులో వున్నందున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో కూడా కరోనాతో పాటు డెంగ్యూ విషజ్వరాలను అరికట్టుటకు వైద్యులు సమయపాలన పాటించి నిరంతరం వైద్యసేవలు అందించాలని మెడికల్ సూపరిండెంట్ గారిని ఆదేశించారు. జిల్లాలోని గ్రామాలలో పారిశుద్యం పనులు నిరంతరంగా నిర్వహించి గ్రామాలలో నీరు నిల్వ వుండకుండా తగు చర్యలు చేపట్టాలని ప్రజలకు సురక్షితమైన త్రాగు నీరు సరఫరా అగునట్లు, బ్లీచింగ్ పౌడర్, క్లోరినేషన్ క్రమపద్దతితో ఉపయోగించునట్లు చర్యలు చేపట్టాలని జిల్లా పంచాయతి అధికారి ని ఆదేశించారు. జిల్లాలోని గ్రామ పంచాయతి సర్పంచ్, సిబ్బంది బాగస్వామ్యంతో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం విధిగా చర్యలు చేపట్టాలని, జిల్లా పంచాయతి అధికారి, డివిజినల్ పంచాయతి అధికారులు మండల పంచాయతి అధికారులు వారి పరిధిలో గ్రామాలలో సందర్శించి ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకోవాలని దావ వసంత సురేశ్ సూచించారు.