Jagtial NewsLatest

లోకమాత పోచమ్మ దేవాలయం 59వ వార్షికోత్సవ వేడుకలు.

జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని పురానిపేటలో స్వయంభూ వెలసిన శ్రీ లోకమాత పోచమ్మ దేవాలయం 59వ వార్షికోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్తలు శుక్రవారం నాడు విలేకరులకు తెలిపారు. ఈనెల 4 నుండి 7 వరకు జరిగే ఉత్సవాల్లో భాగంగా 4 శనివారం నాడు ఉత్సవాల ప్రారంభ పూజలు జరుగుతాయని అన్నారు. ఈ నెల 5 ఆదివారం నాడు మహిళలు, సుహాసినిలచే సామూహిక కుంకుమార్చన, 6 నాడు మహిళలచే దాండియా ఉంటుందన్నారు. 7 సోమవారం నాడు ముగింపు సందర్భంగా గోపాల కాలువలు, విశేషార్చనలు ఉంటాయని ఉత్సవ నిర్వాహక కమిటీ సభ్యులు తెలిపారు. అమ్మ వారి ఆలయ భక్తులు కుటుంబ సమేతంగా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ముఖ్యంగా వైభవంగా జరిగే ఈ వేడుకల్లో అమ్మ వారి భక్తులు కోవిడ్ – 19 నిబంధనలు మాస్క్, శానిటైజర్, సోషల్ డిస్టెన్స్ పాటించాలని ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కోరారు.