బడులను పరిశీలించిన చైర్ పర్సన్
జగిత్యాల: పాఠశాలలు పునఃప్రారంభం కాబోతున్న సందర్భంగా గాంధీనగర్, పురానిపేట ప్రభుత్వ పాఠశాలలను గురువారం మున్సిపల్ ఛైర్పర్సన్ బోగ.శ్రావణి పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులతో వారికి కావలసిన వివరాలు తెలుసుకొని వెను వెంటనే పూర్తి చేయుటకు సానిటేషన్ అధికారులను అదేశించినారు. 01.09.2021 వరకు పట్టణంలోని అన్ని ప్రభుత్వ స్కూల్స్ , అంగన్ వాడి సెంటర్ల, వసతి గృహాల్లో అన్ని శుభ్రపరుచాలని, సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం స్ప్రెయింగ్ చేయుటకు ఫాగ్గింగ్ చేపట్టాలని సిబ్బందికి ఆదేశించారు.యం ఈ ఓ గాయత్రి, కౌన్సిలర్ మేక పద్మావతి, నాయకులు బాలె శంకర్, ఆనంద్ రావ్, మ్యాకల పవన్, పులి శ్రీధర్, పాటశాల నిర్వహకులు, సానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్, మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు.