ఆలయంలో ఛైర్పర్సన్ దంపతుల పూజలు
జగిత్యాల, ఆగస్టు 24:
జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ బోగ శ్రావణి పుట్టినరోజు వేడుకలు పట్టణంలో నాయకులు, కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.
ఛైర్పర్సన్ శ్రావణి పుట్టినరోజు సందర్బంగా కౌన్సిలర్లు, అధికారులు, నాయకులు మంగళవారం ఆమే ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.
ఫోన్లలో,సామాజిక మాధ్యమాల్లో ఛైర్పర్సన్ శ్రావణికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి మరింత ఉన్నతపదవులు పొందాలని అఖాంక్షించారు.
పట్టణంలో పుట్టినరోజు సందర్బంగా అభిమానులు, నాయకులు శ్రావణి ఫొటోలతో ఫ్లెక్షిలు కట్టారు.జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మిగణేశ మందిరంలో స్వామివారిని దర్శించుకుని శ్రావణి ప్రవీణ్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు దంపతులను సన్మానించి ఆశీస్సులు అందజేశారు.స్థానిక నాయకులు వానరాసి తిరుమలయ్య, కైరి భూమా గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు కోటగిరి శ్రవణ్, గంగాధర్, శేఖర్, రాజు తదితరులు ఉన్నారు.